
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
విద్యార్థుల భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు పొన్నలూరు హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో డ్రోన్ నిఘా నిర్వహించారు. పాఠశాల చుట్టుపక్కల ప్రవేశ ద్వారాలు, ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు మరియు సున్నిత ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా సమగ్రంగా పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాల సమయాల్లో విద్యార్థులకు ఎటువంటి అంతరాయం కలగకుండా, భయాందోళనలు లేకుండా సురక్షిత వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ సాంకేతిక నిఘా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పరిస్థితులను తక్షణమే అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని, పాఠశాలలు మరియు ప్రజా ప్రదేశాల భద్రతను మరింత బలోపేతం చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు కూడా అనుమానాస్పద కదలికలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.