
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం మరియు కోడిపందాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో అక్రమంగా పేకాట మరియు కోడిపందాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టారు. కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లాగుంట గ్రామం శివారులో పేక ముక్కల ఆట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి ₹24,450/- నగదు స్వాధీనం చేసుకొని కేసును కందుకూరు రూరల్ పీఎస్కు హ్యాండోవర్ చేశారు. ఈ దాడిని ఎస్ఐ పొన్నలూరు & టీమ్ నిర్వహించారు.ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చాగొల్లు గ్రామ పొలాల్లో కోడిపందాలు నిర్వహిస్తున్న 8 మంది వ్యక్తులను పట్టుకొని 6 కోడులు మరియు ₹23,400/- నగదు స్వాధీనం చేసుకున్నారు.కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాటిచెర్ల గ్రామ పొలాల్లో అక్రమ జూదంపై నిర్వహించిన దాడిలో 7 మంది వ్యక్తులను పట్టుకొని ₹2,240/- నగదు స్వాధీనం చేసుకున్నారు. పి.సి.పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగోవిందపురం గ్రామంలో కోడిపందాలపై దాడి చేసి 6 మంది, 2 కోడులు మరియు ₹2,500/- నగదు స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో మొత్తం 29 మంది నిందితులను అరెస్ట్ చేసి ₹52,590/- నగదు మరియు 8 కోడులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.అక్రమ జూదం మరియు కోడిపందాలు సామాజిక శాంతిభద్రతలకు భంగం కలిగించే నేరాలు కావడంతో, ఇలాంటి కార్యకలాపాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.
