
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ (CASO) ఆపరేషన్ నిర్వహించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్రిచెట్లపాలెం, బోదవాడ ఎస్టీ కాలనీ, మరియు మూసివాగు కాలనీలలో ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో చీమకుర్తి, టంగుటూరు, మరియు ఎన్.జి పాడు ఎస్.ఐ (SI) లు తమ సిబ్బందితో కలిసి సంయుక్తంగా పాల్గొని ప్రతి ఇంటిని మరియు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోదాల్లో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేయడమే కాకుండా, పాత నేరస్థులు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఈ తనిఖీలు నిర్వహించామని, ప్రజలు ఎల్లప్పుడూ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే '100' కు డయల్ చేయాలని ప్రజలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.