
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి
నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
తరుచు విజిబుల్ పోలీసింగ్ చేపడుతూ నేరాలను కట్టడి చెయ్యాలి
పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, వృత్తిపట్ల నిబద్దత,అంకిత భావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం
ప్రకాశం జిల్లాలో కందుకూరు సబ్ డివిజన్ ను కలపటం (విలీనం) ప్రక్రియలో భాగంగా ఉలవపాడు పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును, కేసుల నమోదు, ప్రజలకు అందుతున్న సేవలు, శాంతి భద్రతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఉలవపాడు పోలీస్ స్టేషన్ మంగళవారం జిల్లా ఎస్పీ గారు సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని,గదులను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పట్టుబడిన వాహనాలు మరియు తదితర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే పిర్యదుదారులకు పరిష్కారం అందించాలని, మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, మహిళలు/చిన్నారులపై జరిగే అకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చెడు నడతకలిగిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పండుగలు, ఉత్సవాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్ విలీనంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పోలీస్ సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన, కేసుల దర్యాప్తులో నాణ్యత, రికార్డుల నిర్వహణలో స్పష్టత ఉండాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గుడ్లూరు పోలీస్ పరిధిలో ఉన్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మరియు రామాయపట్నం పోర్ట్ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ .ఈ సందర్భంగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్లో కొనసాగుతున్న నిర్మాణ పనులు, కార్మికుల భద్రత, పారిశ్రామిక కార్యకలాపాలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై జిల్లా ఎస్పీ కి వివరించారు. నిర్మాణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం రామాయపట్నం పోర్ట్ నిర్మాణ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోర్ట్ అధికారులు అక్కడ జరుగుతున్న పనులు, స్ధితిగతులను జిల్లా ఎస్పీ కి వివరించారు. పోర్ట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లు, పోర్ట్ అభివృద్ధి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోనే పోర్టు ఒక ముఖ్యమైన ప్రాంతమని, పోర్టు యాజమాన్యం సమన్వయముతో భద్రతను పటిష్టంగా ఉంచాలన్నారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్బి డిఎస్పీ చిరంజీవి, కందుకూరు డిఎస్పీ సిహెచ్. వి. బాలసుబ్రమణ్యం, కందుకూరు సిఐ షైక్ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ జి.మంగారావు, ఉలవపాడు ఎస్సై వెంకటరావు, గుడ్లూరు ఎస్సై వెంకటరావు మరియు సిబ్బంది ఉన్నారు.
