
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు.సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్చూరు గ్రామ శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి రూ. 2,100/- నగదు మరియు 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లాంపేట ప్రాంతంలో జూదమాడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 10,130/- నగదును సీజ్ చేశారు.నిందితులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.