
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఆధ్వర్యంలో 6 గురు చిన్నారులను వివిధ రాష్ట్రాలకు చెందిన దంపతులకు దత్తత ఇవ్వడం జరిగింది. వేదిక: జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు. దంపతులు: కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు. నేపథ్యం: దత్తత తీసుకున్న వారు పోలీస్, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ మరియు వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారు.కలెక్టర్ సందేశం:"ఈ పిల్లలు దేవుడు ఇచ్చిన వరం. వీరిని మీ సొంత బిడ్డల్లా భావించి, వారికి మంచి భవిష్యత్తును అందించాలి." ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ఎం. నాగమణి , జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీ పి. దినేష్ కుమార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.