
తొలి శుభోదయం కందుకూరు:-
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు కు వచ్చిన ఎస్పీ కి పూల బుకేతో స్వాగతం పలికారు.కందుకూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య, అలాగే శాంతిభద్రతలపై కొద్దిసేపు ఇద్దరు చర్చించుకున్నారు.