
వయోవృద్దులు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం / తూర్పునాయుడుపాలెం :-
వయోవృద్దులు, దివ్యాంగులు సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వయో వృద్ధులు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు సీనియర్ సిటిజన్ కార్డులు, PMJAY, UDID కార్డులు మంత్రి డా. స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….వయోవృద్దులు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) తో 70 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా తీసుకొచ్చాం. వయోవృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకే సీనియర్ సిటిజన్ కార్డులు, యూనిక్ డిజాబులిటీ ఐడి కార్థు (UDID)లు పంపిణీ చేస్తున్నాం. అర్హులైన వారు ఈ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.