
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, కొమరోలు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాల్యవివాహాల హానికర ప్రభావాలు, డ్రగ్స్ & గంజా మాదకద్రవ్యాల ప్రమాదాలు, ఆన్లైన్ మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలి వంటి ముఖ్య అంశాలను విద్యార్థులకు వివరించారు.అత్యవసర సందర్భాల్లో 100, సైబర్ మోసాలపట్ల 1930 నంబర్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.విద్యార్థులు చట్టాన్ని గౌరవించి, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పోలీసులు పిలుపునిచ్చారు.