
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ జూద కార్యకలాపాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ రైడ్లలో పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి బైక్లు, మొబైల్ ఫోన్లు మరియు గణనీయమైన నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సమాజంలో నేరాలను ప్రోత్సహిస్తాయని, ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పదంగా జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సమాజాన్ని నేరరహితంగా మార్చేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు.