
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న లాడ్జ్‌లు, లాడ్జింగ్ రూములు మరియు హోటళ్లపై పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.తనిఖీల సందర్భంగా లాడ్జ్‌లలో ఉన్న సందేహాస్పద వ్యక్తులు, సందర్శకుల వివరాలను పరిశీలించి నమోదు చేశారు. లాడ్జ్ యాజమాన్యానికి సందర్శకుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయడం, సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేసేలా చూడడం, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారమివ్వాలని కఠిన సూచనలు అందించారు.నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.