
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు భారీ స్థాయిలో నిర్వహించారు.ప్రధాన జంక్షన్లు, హైవేలు, పట్టణ ప్రాంతాల్లో పోలీసులు శ్వాస పరీక్షలు (Breathalyzer Tests) నిర్వహించి, మద్యం సేవించి వాహనం నడుపుతున్న డ్రైవర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ డ్రంక్డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపకుండా ప్రజలు అవగాహన పెంచుకుని సమాజ రక్షణలో భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.