
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బాలోత్సవం కార్యక్రమంలో స్మార్ట్ జెన్ పాఠశాల విద్యార్థిని ఈ. అమూల్య (8వ తరగతి) నృత్య ప్రదర్శన విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన గీతారాణి మాట్లాడుతూ, బాలోత్సవం వంటి జిల్లా స్థాయి పోటీల్లో మా విద్యార్థిని పాల్గొని ప్రథమ స్థానాన్ని సాధించడం ఎంతో గర్వకారణం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సామాజిక నైపుణ్యాలు మరింత పెంపొందుతాయని,చదువుతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు ప్రతిభ చూపినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది అని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థినికీ అభినందనలు తెలియజేశారు.