
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు "మహిళలు తమ స్వయం శక్తిని గుర్తించి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి" అని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న చేయూతను ఆసరాగా చేసుకుని, మహిళలు ఆర్థికంగా మరియు సామాజికంగా ఎదగాలని ఆకాంక్షించారు.మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా మెప్మా, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భారీ ఆర్థిక సాయాన్ని అందజేశారు.మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.