
భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు
ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ. 25 వేల ప్రోత్సాహం
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:-
ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో 116 మంది లబ్ధిదారులకు రూ. 90 లక్షల విలువైన సీఎం. ఆర్ ఎఫ్ చెక్కుల్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1640 మందికి రూ. 12 కోట్ల 92 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశాం. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఆరోగ్య అవసరాలకు పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని సీఎం. ఆర్. ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నారు. పేదల ఆరోగ్యానికి ధీమాగా రూ. 25 లక్షలతో బీమా సౌకర్యం తీసుకొస్తున్నాం. సంజీవని పథకంతో రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ ని డిజిటలైజేషన్ చేస్తాం. భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ. 25 వేల ప్రోత్సాహం అందించే విషయంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2023 నివేదిక ప్రకారం ఏపీలో ఏడాదికి 6.70లక్షల మంది పిల్లలు మాత్రమే పుడుతున్నారు. ఈ లెక్కన 2047 నాటికి ఏపీలో వృద్దుల సంఖ్య ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే జనాభా వృద్ధిపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
