
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వారిపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్కులు, రహదారులు, బస్టాండ్ పరిసరాలు తదితర బహిరంగ ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.ఈ చర్యల ద్వారా శాంతి భద్రతలు పటిష్టం చేయడం, ప్రజలు నిర్భయంగా జీవించేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.