
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ
నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరంగా తెలియజేయగా, వాటిని శ్రద్ధగా విని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలకు సంబంధించిన రెవిన్యూ సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించడం విశేషం. ప్రజాదర్బార్ ద్వారా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తామని ఆమె తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పేర్కొన్న డా. లక్ష్మీ, సమస్య చెప్పిన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపడంతో ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.