
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
బుధవారం తెల్లవారుజామునే కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3 మరియు 4వ వార్డుల్లో కాలినడకన పర్యటించి, స్థానిక సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉప్పుచెరువు, జనార్ధన కాలనీ, RTC డిపో పరిసరాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండటంపై సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాను. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించాను. ఇకపై ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. 3వ వార్డు NGO కాలనీ భూములను 22A జాబితా నుండి తొలగించి, 15 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించిన విషయాన్ని కాలనీ వాసులతో పంచుకున్నాను. త్వరలోనే అక్కడ రోడ్ల అభివృద్ధి పనులు చేపడతాం.4 వార్డుల్లో పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను. నాణ్యత పాటించని కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేయాలని స్పష్టమైనఆదేశాలు జారీ చేశాను. మన కందుకూరును క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకోవడంలో మీ అందరి సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.