
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, భద్రతా చర్యల భాగంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ BD టీమ్, RSI సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్‌తో కలిసి గుండ్లకమ్మ రిజర్వాయర్ పరిసరాలు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంతాల్లో విస్తృతంగా భద్రతా తనిఖీలు నిర్వహించారు.తనిఖీలలో భాగంగా సున్నిత ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలు, సందర్శకుల రాకపోకల మార్గాలు, ఒంటరిగా ఉన్న ప్రాంతాలను పూర్తిగా పరిశీలించి భద్రతా లోపాలు లేకుండా నిర్ధారించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.ప్రజల భద్రత మా ప్రధానం అని, ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని మద్దిపాడు పోలీస్ అధికారులు తెలిపారు.