
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 32 ఫిర్యాదులు
తొలి శుభోదయం మార్కాపురం పోలీస్:-
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.ఆదేశాల మేరకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం” (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజుతో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొని, జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను సవివరంగా తెలుసుకుని, అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి సత్వర పరిష్కారం అందిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ, అందిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు, సర్కిల్ అధికారులు మరియు సబ్-డివిజన్ అధికారులకు బదిలీ చేసి, వాటిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిలో నడవలేని స్థితిలో ఉన్న బాధితులకు పోలీస్ సిబ్బంది సహాయం అందించి, వారు స్వేచ్ఛగా తమ సమస్యలను తెలియజేసేలా ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు, భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలు తదితర అంశాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు.జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు లేదా సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా అందచేయవచ్చు.ఈ కార్యక్రమంలో మార్కాపురం సిఐ సుబ్బారావు, త్రిపురాంతకం సిఐ అస్సాం, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
