
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 124 ఫిర్యాదులు
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు ఐపియస్., ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో "మీకోసం"(PGRS) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు స్వీకరించి వారితో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల విశ్వాసం పెంపొందించడమే కాకుండా బాధితులకు తక్షణ సహాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు రూరల్ ఇన్స్పెక్టర్ యం.శేషగిరి రావు, సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు, కొండేపి సీఐ సోమశేఖర్, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
