
ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 27 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం ఒంగోలు, జిల్లా పోలీస్ కార్యాలయంలో "మీకోసం"(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను పోలీస్ అధికారులకు అందించి, వారియొక్క సమస్యలను వివరించారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి ఫిర్యాదుల నేపథ్యాన్ని తెలుసుకొని, వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కనిగిరి సీఐ శ్రీనివాసరావు, వై పాలెం సిఐ కె.అజయ్ కుమార్,గిద్దలూరు రూరల్ సీఐ రామ కోటయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.
