
ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంకు 71 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
బాధితులు నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారు నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన 71 ఫిర్యాదిదారుల అర్జీలను ఎస్పీ మరియు పోలీస్ అధికారులు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. అందిన ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఎటువంటి ఆలస్యం లేకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీస్ అధికారులు క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదు చేసిన ప్రతి వ్యక్తి సమస్యను చట్టపరంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు, ఉద్యోగ మోసాలు మరియు మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారిలో కొంత మంది వృద్ధులు, నడవలేని స్థితిలో ఉండేవారు ఫిర్యాదు చేయడానికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని సత్వర న్యాయం అందిస్తామని భరోసా వారిలో కలిగించాలని సిబ్బందికి తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి రమణ కుమార్, ఒంగోలు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, అద్దంకి రూరల్ మల్లికార్జున రావు, కొండేపి సీఐ సోమశేఖర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు, ప్యానల్ అడ్వకేట్ బి. బాలాజీ సింగ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.