
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో HDFC బ్యాంకు సమీపంలో తులసి దంత వైద్యశాల, కోవూరు రోడ్డులో ప్రణవి చిన్నపిల్లల మరియు కంటి హాస్పిటల్ ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. నిర్వాహకుల ఆహ్వానంతో, గౌరవ MLA ఇంటూరి నాగేశ్వరరావు గారు… ఆయా హాస్పిటల్స్ కు వెళ్లి డెంటల్ డాక్టర్ ఆత్మకూరి మధుసూదన రాజు, ప్రణవి హాస్పిటల్ డాక్టర్లు కే.నవీన్ కుమార్, నల్లూరి ప్రశాంతిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా పేదలకు మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే గారి వెంట టిడిపి నాయకులు బెజవాడ ప్రసాద్, చుండూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.