
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన షేక్ ఆప్రిన్ కు బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఈ. వెంకటేశ్వర్లు, మేనేజర్ బి. నాగేశ్వరావు బుధవారం అందజేశారు. మండల ములోని పలుకూరు షేక్ సుభాని భాష రోడ్డు ప్రమాదంలో మరణించారు. గతంలో మా గ్రామంలో అర్థిక అక్షరాస్యత కేంద్రం కందుకూరు కౌన్సిలర్లు, మీరా మొహిద్దిన్, అనిల్ కుమార్ ఆర్థిక అక్షరాస్యత అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కౌన్సిలర్లు బ్యాంకింగ్ పథకాలపై, సామాజిక భద్రతా పథకాలపై, డిజిటల్ బ్యాంకింగ్ పై, ప్రైవేటు ఆర్థిక సంస్థల మోసాలపై, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై,అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్మన్,అన్ క్లెయిమ్ డిపాజిట్లు పై అవగహాన కల్పించారు.అంతే కాకుండా పి యం యస్ బి వై పి యం జె జె బి వై భీమా లు ఉంటాయి అని ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కి సంవత్సరానికి 20/- రూపాయలు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సంవత్సరానికి 436/- రూపాయల ప్రీమియం చేసుకున్నట్లయితే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వ్యక్తికి 2,00,000/-రూపాయిలు ఇన్సూరెన్స్ ఉంటుందని, రూపే ఎటిఎం కార్డు ఉపయోగించినవరీకి ప్రమాదవశాత్తు మరణించి నట్లు అయితే 2,00,000 భీమా వస్తుంధని తెలియ జేశారు .నా భర్త చనిపోయిన విషయం వారికి తెలియజేయమని అన్నారు .. మా భర్త పాస్బుక్ చూపిస్తే సార్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కందుకూరు బ్రాంచ్ లో స్టేట్మెంట్ తీసి చూస్తే నా భర్త ఖాతా నుండి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్సు వుంద ని బ్రాంచ్ మేనేజర్ నాగేశ్వరరావు చెప్పారు. ఇన్సూరెన్స్ కి అప్లై చేసారు.నా భర్తకు నామిని అయిన నాకు ఇన్సూరెన్స్ డబ్బులు 2,00,000/-ల రూపాయలు నా బ్యాంకుఖాతాకు జమ చెసారు. నాకు ఈ డబ్బులతో నేను వ్యవసాయం చేసుకుంటూ నా పిల్లలు ను చదివించుకోవడం నా కుటుంబ అభివృద్ధి కి ఉపయోగించుకుంటాననీ చెప్పారు.మాకు ఇంత పెద్ద సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు బ్యాంకు మేనేజర్ నాగేశ్వరరావు ఎస్.ఎస్.టీ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.ఆంజనేయులు , ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ లకుప్రత్యేక ధన్యవాదాలను తెలియ జేశారు .కందుకూరు ఆర్థిక అక్షరాస్యత
కౌన్సిలర్లు మీరా మొహిద్దిణ్, అనిల్ కుమార్ లకు కృతజ్ఞతలను తెలిపారు.