
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని కందులాపురం సెంటర్ ప్రాంతంలో రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్సీ హర్షవర్ధన్ రాజు సూచనల మేరకు ఈరోజు మంగళవారం కంభం మండలం ఎస్సై శివకృష్ణారెడ్డి కన్వెక్స్ మిర్రర్ ఏర్పాట్లు చేశారు. మూలమలుపుల వద్ద వాహనదారులకు స్పష్టమైన దృశ్యం కనిపించేవిధంగా ఈ అద్దాలు ఉపయోగపడతాయని ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మిర్రర్ ద్వారా మూల మలుపుల వద్ద వచ్చే వాహనాలను ముందుగానే గమనించే అవకాశం ఉంటుందని తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గే ఛాన్సు ఉందని ఎస్సై అభిప్రాయపడ్డారు. ఇంకా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ వాహనదారులు పోలీస్ అధికారులు ఇచ్చిన సూచనలు సలహాలు పాటించాలని మరియు పాదచారులు కూడా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.