
తొలి శుభోదయం:-
లింగసముద్రం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్టు నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టును పరిశీలిస్తూ నీటిమట్టాన్ని చూస్తూ ఉండాలని సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు అన్నారు. శనివారం ఆయన రాళ్లపాడు ప్రాజెక్టును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం నుంచి పడుతున్న వర్షాలకు ప్రాజెక్ట్ పూర్తిగా నిండు వచ్చిందని రైతులకు ఈ సంవత్సరం సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు నీటిని విడుదల చేయాలని అదేవిధంగా మరల తుఫాను ఉందని అధికారులు చెబుతున్నారు కాబట్టి ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండే ప్రాజెక్టు ఎటువంటి నష్ట రాకుండా చూడాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి ప్రాజెక్టుకి ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు ఆనంద్ మోహన్, నాయకులు డి బాబురావు, కే హరిబాబు, డి బాబురావు తదితరులు పాల్గొన్నారు.