
కమ్మరపల్లి సుజాత కి అండగా నిలిచిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్
న్యాయం కోసం హోం మినిస్టర్ ని కలుస్తా అంటున్న కనపర్తి మనోజ్ కుమార్
తొలి శుభోదయం పొన్నలూరు:-
ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండల కేంద్రంలో SBI బ్యాంకు వెనుక కమ్మరపల్లి సుజాత వారి భర్త కోటయ్య నివాసం ఉంటున్నారు. భర్త కోటయ్య పొన్నలూరు మండలంలో కొంతమంది దగ్గర అధిక మొత్తంలో అప్పుగ వడ్డీలకు డబ్బులు తెచ్చుకున్నాడు, తెచ్చుకున్న డబ్బులను సమయానికి తిరిగి కట్టలేని పరిస్థితి ఏర్పడింది, కోటయ్యకు 50 లక్షలు విలువ చేసే సొంత ఇల్లు ఉంది, ఆ ఇంటిని అమ్మి అప్పులు తీరుస్తాను కొంత సమయం ఇవ్వండి అని అందరికీ నచ్చ చెప్పాడు.
ఇంటి పక్కనే ఉంటున్న మండవ బాలయ్య మరియు వారి భార్య మండల ఆదిలక్ష్మి ఇద్దరు పెట్టే టార్చర్ తట్టుకోలేక భయంతో 8 నెలల క్రితం ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో మండవ బాలయ్య ప్రతిరోజు మద్యం సేవించి కమ్మరపల్లి సుజాత వాళ్ల ఇంటికి వచ్చి గొడవ చేస్తూ గోల చేస్తూ, ఇంట్లో సుజాతని మరియు వాళ్ళ పిల్లల్ని పెట్టి ఇంటి బయట తాళం వేసి గడప దగ్గర మూత్రం పోసేవాడు, సుజాత వాళ్ళ కుటుంబాన్ని అవమానిస్తూ అసహ్యంగా మాట్లాడుతూ బూతులు తిడుతూ ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, మండవ బాలయ్య మరియు వారి భార్య ఆదిలక్ష్మి పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేశారు.
న్యాయం కోసం ప్రాణ రక్షణ కోసం 3 రోజులు క్రితం జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ గారిని కలిసి జరిగిన విషయాలు మొత్తం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి, స్వయంగా కనపర్తి మనోజ్ కుమార్ వారిని మంగళగిరిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ శ్రీమతి రాయపాటి శైలజా గారిని కలిపించి, ప్రాణ రక్షణ కోసం ఫిర్యాదు చేయించడం జరిగింది, ఆధారాలతో సహా వీడియో ఫుటేజ్ లు ఇవ్వడం జరిగింది, ఇక్కడ న్యాయం జరగకపోతే అతి తొందర్లో గౌరవ హోంమినిస్టర్ వంగలపూడి అనిత గారి దగ్గరకు కూడా తీసుకెళ్తాను అని మనోజ్ కుమార్ తెలియజేశారు.
నేను 10 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తాను, నాకు 50 లక్షలు విలువ చేసే సొంత ఇల్లు ఉంది, నా ఇంటిని అమ్మి నేను పొన్నలూరు మండల కేంద్రంలో ఇవ్వవలసిన ప్రతి ఒక్కరికి తిరిగి డబ్బులు చెల్లిస్తాను, గౌరవంతంగా బ్రతుకుతాను అని కోటయ్య మనోజ్ కుమార్ కి తెలియజేశాడు.