
తొలి శుభోదయం ప్రకాశం:-
ఫిబ్రవరి ఒకటవ తేదీ సింగరాయకొండ మండల కేంద్రంలో జరుగు ఐ ఎఫ్ టి యు ప్రకాశం జిల్లా జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని ఐయఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆర్,మోహన్, ఐయఫ్ టి యు జిల్లా నాయకులు కామ్రేడ్ టి,వెంకట్రావు సిహెచ్,రంగారావు పిలుపునిచ్చారు, ఆదివారం ఐయఫ్ టి యు జిల్లా జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని కోరుతూ సింగరాయకొండ మండల కేంద్రంలో విస్తృత ప్రచారం జరిగింది,ఈ ప్రచారంలో భాగంగా ప్రజల ఉద్దేశించి కామ్రేడ్ రంగారావు వెంకట్రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడుదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చిందని,ఈ లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని,అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాటింది,ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించలేదు,సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, లారీ, ఆటో ఇతర వాహనాలకు ఫిట్ నె స్ సర్టిఫికెట్లు జారీ చేసే ఫిట్ నెస్ సెంటర్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని,దానివల్ల అవినీతి కి అవకాశం ఉందని, అందువలన ప్రైవేట్ ఫిట్ నె స్ సెంటర్లను రద్దుచేసి ప్రభుత్వమే నిర్వహించాలని, ఆటో కార్మికుల పై భారీ చలానాలు విధించే జీవో నెంబర్ 21 రద్దు చేయాలనిvప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై చేస్తున్న దాడికి నిరసనగా నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సంబంధించి చేయాలని పిలుపునిచ్చారు, జనవరి 25వ తేదీ జరగవలసిన ఐ ఎఫ్ టి యు ప్రకాశం జిల్లా కౌన్సిల్ ఫిబ్రవరి ఒకటో తేదీకి అniవార్య కారణాలవల్ల వాయిదా పడిందని ఈ విషయాన్ని గుర్తించి జిల్లాలో కార్మికులు మేధావులు, ప్రజా సమస్యలు జిల్లా జనాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకుల సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కే నాంచార్లు, ఐ ఎఫ్ టి యు నాయకులు కామ్రేడ్ కె నారాయణ, ప్రగతిల మహిళా సంఘం పిఓడబ్ల్యు నాయకులు ఆవుల యానాదమ్మ, తదితరులు పాల్గొన్నారు