
తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:-
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సత్తెనపల్లిలోని ఒక పెట్రోల్ బంకును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా వినియోగదారుల వాహనాలకు డీజిల్ నింపి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యావసరాల సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో, జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.
"ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి కంగారు పడకండి" అని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు.