
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం లోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాయవరం బస్సు ప్రమాద బాధితులను జిల్లా నూతన కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం రాత్రి పరామర్శించారు.ఈ సందర్భంగా వైద్యం అందుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండి పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్లాలని వారికి భరోసానిచ్చారు.చిన్న చిన్న గాయాలతో కోలుకొని ఇంటికి వెళ్లిన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఏదైనా అవసరమైతే వారికి సైతం వైద్య పరంగా సహాయం అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డిఎంహెచ్వో వాణిశ్రీ, జిల్లా మలేరియా అధికారి రాహుల్, ఇతర ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు……