
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు కొత్తగా నడపబోతున్న 5 బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఆదివారం ప్రారంభించారు. కందుకూరు నుండి గుంటూరుకు టుస్టార్ సర్వీసులు 3, కందుకూరు నుంచి గుడ్లూరు, భీమవరం ఉలవపాడు మీదుగా హైదరాబాద్ బి హెచ్ఇఎల్ వరకు ఒకటి, కందుకూరు నుండి విశాఖపట్నంకు మరొక సర్వీసును ఎమ్మెల్యే గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు ప్రాంత ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. అలాగే కందుకూరు డిపో పరిధిలో… కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకువచ్చేలా సంబంధిత మంత్రితో మాట్లాడతానని తెలిపారు. పలు గ్రామాలకు నడుస్తున్న బస్సు సర్వీసులు, కొత్తగా నడపాల్సిన సర్వీసులపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో డిఎం ఆర్ శ్రీనివాసులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు బెజవాడ ప్రసాద్, గోచిపాతల మోషే, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, ముచ్చు లక్ష్మీరాజ్యం, పార్వతి, చుండూరి శ్రీనివాసులు, మేడా మల్లికార్జున, గుమ్మా శివ, మచ్చా మనోహర్, అత్తింటి శివకృష్ణ, నల్లూరి సూర్యనారాయణ, భవనాసి వెంకటేశ్వర్లు, చుంచు వేణు శ్రావణ్, శివరామకృష్ణ, దారం విజయ్, యూనియన్ నాయకులు నల్లూరి సుబ్బారావు, శివకృష్ణ, డివై కొండలు మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.