
తొలి శుభోదయం ప్రకాశం :-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పరిశుభ్రత లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై కఠిన చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ అక్రమంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం సేవనంతో అపరిశుభ్రంగా మారిన ప్రదేశాలను శుభ్రపరుస్తూ పరిశుభ్రత కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రజలు వినియోగించే ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో పోలీసులు స్వయంగా పాల్గొనడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు.ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు, పహారాలు, ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసులు తెలిపారు. నేర రహిత, పరిశుభ్రమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ముందుకు సాగుతోందని వెల్లడించారు.