
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజా శాంతిభద్రతలు, సామాజిక క్రమశిక్షణ పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీస్ పరిధిలోని పురుషోత్తమన్పల్లి గ్రామంలో ఓపెన్ బూజింగ్ (బహిరంగ మద్యపానం) ప్రాంతాలపై శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.కొమరోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, బహిరంగంగా మద్యపానం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు బహిరంగ మద్యపానం వల్ల కలిగే సామాజిక దుష్పరిణామాలు, కుటుంబాలపై పడే ప్రభావాల గురించి అవగాహన కల్పించారు.బహిరంగ మద్యపానం వల్ల నేరాలు, ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ బూజింగ్ నియంత్రణకు, ప్రజల భద్రతకు ఇలాంటి శుభ్రత–అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.