
పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
12 సంవత్సరాల కన్నకూతురు పై అత్యాచారం చేసిన తండ్రికి సోమవారం ( 06.04.26) గౌరవ POCSO కోర్టు జడ్జీ శ్రీ కె.శైలజ గారు నిందితుడికి.20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.7000/-జరిమానా బాధితురాలికి మూడు లక్షల రూపాయలు DLSA ద్వారా పరిహారం చెల్లించమని తీర్పు చెప్పిన గౌరవ POCSO కోర్ట్ జడ్జీ.కొండేపి మండలంలోని ఒక వ్యక్తి 12 సంవత్సరాలు కూతురి పై తేది 19.10.2025 వ తేదీన ఉదయం సుమారు 10.00 గంటల సమయంలో భార్య ఇంటి దగ్గర లేని సమయంలో తన కుమార్తెను ఇంటి గదిలోనికి తీసుకుని వెళ్లి బలవంతంగా అత్యాచారం చేసి, తన అమ్మకి గాని మరి ఎవరికైనా ఈ విషయం చెపితే చంపుతానని బెదిరించగా, బాధితురాలు భయపడి ఈ విషయాన్ని వాళ్ళ అమ్మకు చెప్పకుండా రెండు రోజులు దాచిపెట్టినది. కానీ తర్వాత పొలం పనులు కోసం వెళ్లి వచ్చిన తల్లికి బాధితురాలు జరిగిన విషయాన్ని చెప్పగా వెంటనే వారు కొండపి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు SI బి. ప్రేమ్ కుమార్ కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును అప్పటి కనిగిరి DSP P. సాయి ఈశ్వర్ యశ్వంత్ గారికి కేసును అప్పగించగా DSP గారు సమగ్రంగా దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. అనంతరం కోర్టులో ఛార్జి షీట్ వేయడం జరిగింది.పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్ట్ నందు హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిందితుడుపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 06.04.2026న ఒంగోలులోని గౌరవ POCSO కోర్ట్ జడ్జి శ్రీ కె.శైలజ గారు నిందితుడుకి 20 సంవత్సరాలు జైలు శిక్ష రూ.7000/-.వేల రూపాయలు జరిమానా,భాధితురాలకు నష్టపరిహారం మూడు లక్షల రూపాయలు ఒంగోలు DLSA ద్వారా అందచేయవలసిందిగా ప్రకటించారు.అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులకు ఇటువంటి తీర్పులు గుణపాఠంగా నిలవాలని, చిన్న పిల్లలు పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ అన్నారు.పై కేసులో ముద్దాయికి శిక్ష పడటంలో కృషిచేసిన పోలీస్ అధికారులను మరియు కోర్ట్ లైజన్ ASI E.V స్వామి, కానిస్టేబుల్ యల్లమంద, కొండీపి సర్కిల్ నుండి ASI: 789 S.బాలకృష్ణ మూర్తి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావుని జిల్లా ఎస్పీ అభినందించారు.