
పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ 5 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి మంగళవారం( 31.03.26) గౌరవ POCSO కోర్టు జడ్జీ శ్రీ కె.శైలజ నిందితుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.5000/-జరిమానా బాధితురాలికి 75000/- వేలు రూపాయలు compamsation చెల్లించ మని తీర్పు చెప్పిన గౌరవ POCSO కోర్ట్ జడ్జీ .వెలిగండ్ల మండలంలోని ఒక గ్రామానికి చెందిన బద్దిపూడి అనోక్ 40 సంవత్సరాలు అనే వ్యక్తి, తేదీ 24.07.2022 సంవత్సరము లో 5 సంవత్సరాల బాలిక తన ఇంటి దగ్గరగా ఉండగా ఆ సమయంలో పాప తల్లి మేత కోసం మరియు తండ్రి మేకలు మేపుకోవటానికి పొలంకు వెళ్లి ఉండగా,ముద్దాయి మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి బాలిక వాళ్ల ఇంటి లోపలకి తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బంధువులను చూసి అక్కడ నుండి పారిపోయినాడు. తర్వాత వారు వెలిగండ్ల పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి SI P.Viswa Nadh Reddy, కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ DSP అయిన A.పల్లపురాజు గారికి కేసును అప్పగించగా DSP గారు దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. అనంతరం కోర్టులో ఛార్జి షీట్ వేయడం జరిగింది.పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్ట్ నందు హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిందితుడుపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 31.03.2026న ఒంగోలులోని గౌరవ POCSO కోర్ట్ జడ్జి శ్రీ కె.శైలజ నిందితుడుకి.10 సంవత్సరాలు జైలు శిక్ష రూ5000/- వేల రూపాయలు జరిమానా,భాధితురాలకు
75000/-. వేల రూపాయలు నష్ట పరిహారమును ఒంగోలు DLSA ద్వారా అందచేయవలసిందిగా ప్రకటించారు.అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులకు ఇటువంటి తీర్పులు గుణపాఠంగా నిలవాలని, బాలికలు ధైర్యంగా ఉండాలని ఏదైనా సమస్య వచ్చిన తల్లిదండ్రులకు చెప్పాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. చిన్న పిల్లలు పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ అన్నారు.పై కేసులో ముద్దాయికి శిక్ష పడటంలో కృషిచేసిన పోలీస్ అధికారులను, G. క్రిష్ణ పావని S. I, వెలిగండ్ల P. S, మరియు కోర్ట్ లైజన్ ASI E.V స్వామి, కానిస్టేబుల్ యల్లమంద, వెలిగండ్ల ps PC 3831K.సాయి హరికృష్ణారెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు గారిని జిల్లా ఎస్పీ అభినందించారు.