
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఆదివార ఫిబ్రవరి 8వ తేదీన ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా బాలోత్సవ పోటీలలో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని చిరంజీవి షేక్ రేష్మ శ్రీ కథా రచన విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు. ఆ విద్యార్థిని కి నిర్వాహకులు సర్టిఫికెట్ మరియు మెమెంటోనీ ఆదివారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఒంగోలులో బహుకరించారు.ఆ విద్యార్థినిని సోమవారం నాడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సింగరాయకొండ ప్రధానోపాధ్యాయిని కే మహాలక్ష్మి పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అభినందించారు. పాఠశాల విద్యార్థినులు అన్ని విభాగాలలోనూ రాణించాలని ప్రధానోపాధ్యాయని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.