
మండల న్యాయ సేవ అధికార సంఘం చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ.
తొలి శుభోదయం కందుకూరు:-
లీగల్ లిటరసీ క్యాంప్ సందర్భంగా శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు కందుకూరు పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగినది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్న మండల లీగల్ సెల్ అధారిటీ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ గారు మాట్లాడుతూ మండల లీగల్ సెల్ అథారిటీ తరఫున న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించి బాల బాలికలను చైతన్యవంతం చేస్తున్నామని దానిలో భాగంగా శనివారం బాల్య వివాహముల నిషేధం చట్టం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ చట్ట ప్రకారం బాలికలు కనీసం 18 సంవత్సరముల వయసు నిండిన తర్వాత మాత్రమే వివాహం తలపెట్టాలని కుటుంబములోని తల్లిదండ్రులు పెద్దలు అందరూ కూడా బాలికలను చదివించి ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. మైనర్ బాలికల వివాహాలు చట్టరీత్యా నేరం ఒకవేళ ఈ చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తే బాధిత బాలికలు మండల్ లీగల్ సెల్ అథారిటీ ని, పోలీసులను,స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ముందుగా భారత ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ద్వారకా రాణి అధ్యక్షత వహించారు.న్యాయవాదులు పోకూరి కోటయ్య , ముప్పవరపు.కిషోర్, పండిత్ సంపత్ కుమార్, షేక్ జమీర్, మామిడాల మనోహర్ పాల్గొన్నారు.