
తొలి శుభోదయం ప్రకాశం:-
జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు భాగంగా ప్రకాశం జిల్లా ఇన్చార్జి ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపిఎస్. ఆదేశాల మేరకు గురువారం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. బాల్య వివాహం అనేది ఒక సామాజిక దురాచారం మరియు చట్ట ఉల్లంఘన, ఇది బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధిని అడ్డుకుంటుందని మరియు వారి కలలను సహకారం చేసుకోకుండా నిరోధిస్తుంది.పోలీస్ అధికారులు మరియు సిబ్బంది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తానని, నా కుటుంబంలో పరిసరాలలో లేదా సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తానని, బాల్య వివాహ ప్రయత్నాన్ని పంచాయితీ మరియు ప్రభుత్వ అధికారులకు నివేదిస్తాను. అందరూ పిల్లల విద్యా మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత భారత సృష్టికి నేను మద్దతుగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు.ప్రజలు కూడా ఈ సమస్య గురించి అవగాహన పెంపొందించుకొని, బాల్య వివాహాలను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమణారెడ్డి, అర్ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.