
తొలి శుభోదయం న్యూస్ ఆదోని:-
ఆదోని పట్టణ కేంద్రంగా ఐదు నియోజకవర్గాలను ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం,ఆదోని కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించాలని చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష 110 రోజుకు చేరుకున్నది. బాల బాలికలు వారి యొక్క భవిష్యత్తులో సరైన వైద్యం లేక, సరైన విద్యా వసతులు లేక, సరైన పరిశ్రమలు లేక, ఉన్నతమైన చదువులు చదివి నిరుద్యోగులుగా ఉండకూడదు అనుకుంటే ఆదోని జిల్లాతోనే సాధ్యమవుతుంది. ఆదోని ప్రాంతంలో పరిశ్రమలు లేక నిరుద్యోగులుగా ఎంతోమంది మిగిలి ఉన్నారు. వారందరికీ ఉద్యోగాలు రావాలంటే ఆదోని జిల్లాతోనే సాధ్యమవుతుంది వారి పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆదోని జిల్లాని కూటమి ప్రభుత్వం టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు కలిసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జాయింట్ ఆక్షన్ కమిటీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో ఆదోని ప్రాంతానికి వారు జన్మించిన ప్రాంతానికి ద్రోహం చేసినవారుగా మిగిలిపోతారని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిలర్లు సర్పంచులు ఎంపిటిసిలు జడ్పిటిసిలు ఆదోని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ద్రోహం చేయకుండా వెంటనే జిల్లా ప్రకటించే దిశగా మీ ఆధిపత్య నాయకానికి ఒత్తిడి తీసుకురావాలని ఆదోని జిల్లా జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాము గురువారం 110 రోజుగా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి కుమార్ అన్న, సుభాష్ చంద్రబోస్, రామాంజనేయులు, భూదెప్ప, రామాంజనేయులు, దిబ్బనకల్లు హుస్సేన్ దీక్షలు కూర్చొని మద్దతు తెలిపారు.110 రోజు రిలే నిరాహార దీక్షను ప్రారంభించిన ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు, సుజ్ఞానమ్మ,వైపీ నాగరాజు, పగడాల కోదండ, టి వీరేష్,గుమ్మల బాలస్వామి, రామలింగయ్య, గోవిందు, జగన్, పిఎస్ వీరేష్, గంగపుత్ర ప్రకాష్, రామకృష్ణ, మరియు తదితరులు పాల్గొన్నారు