
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
బింగినపల్లి పంచాయతీ పరిధిలో రొయ్యల చెరువు ఊట సాగునీటి చెరువుకు రాకుండా నిరోధించేందుకు మంగళవారం బింగినపల్లి చెరువు నీటి సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రామస్తులు రొయ్యలు చెరువుల యజమానులతో సమావేశం జరిగింది రొయ్యల చెరువులు యజమానులు వారి చెరువు నుండి వస్తున్న వ్యర్ధపు ఊట ను సాగునీటి చెరువుకు రాకుండా చేయాలని రొయ్యల చెరువు యజమానులకు నీటి సంఘం కమిటీ రైతులు కోరారు గ్రామస్తులు కోరిన విధంగా ఉప్పునీటిని అరికడతామని దీనికోసం అక్కడ పైపులు ఏర్పాటు చేసి మన్నేటికీ వ్యర్ధనీటిని మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెరువుల యజమానులు నీటి సంఘం నాయకులకు రైతులకు గ్రామస్తులకు హామీ ఇచ్చారు
దీంతోపాటు ఆబోతు వరవ పైభాగానున్న ఆల్ఫా ఫ్యాక్టరీ మురికి నీరు మరియు ఉప్పునీరు రొయ్యల తలల వ్యర్ధాలను వర్షం వచ్చినప్పుడు ఆబోతు వరద ద్వారా బింగినపల్లి సాగునీటి చెరువుకు వదులుతున్నట్లు రైతులు గ్రామస్తులు గుర్తించారు ఈ విషయమై రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కి తెలియజేసి ఆ తర్వాత కలెక్టర్ కి అర్జీని ఇప్పిచ్చే విధంగా మాట్లాడుకున్నారు ఈ కార్యక్రమానికి బింగినపల్లి సాగునీటి చెరువు కింద ఉండే ఆయకట్టు రైతులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు