
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణ పరిధిలోని పామూరు రోడ్డు నందు ఉన్న బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ పాఠశాల నందు ముందస్తు ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బాల, బాలికలు సాంప్రదాయ వస్త్రాలను ధరించి.. భక్తి శ్రద్ధలతో లక్ష్మి పూజ చేసి ప్రసాదాలు,ఉగాది పచ్చడి పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బి.ఆర్ ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు గారు మాట్లాడుతూ.. ఉగాది తెలుగువారి నూతన సంవత్సరం అని షడ్రుచులు ఉగాది పచ్చడిలాగా మన జీవితం ఉంటుందన్నారు.జీవిత గమనంలో కష్ట సుఖాలను అనుభవిస్తూ ముందుకు సాగాలని తెలిపారు. విద్యాసంస్థల డైరెక్టర్ జి.బాల భాస్కర రావు మాట్లాడుతూ.. విద్యార్థులందరూ కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ బి. నరేంద్రబాబు, పాఠశాల డీన్, ప్రిన్సిపాల్స్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.