
పలు రికార్డులు, ఫైల్స్ తనిఖీ… సిబ్బంది పని తీరుపై ఆరా
పెండింగ్ కేసులపై అధిక దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి: జిల్లా ఎస్పీ
నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి
విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలు తగ్గుముఖం
క్రికెట్ బెట్టింగ్ అరికట్టడంపై కట్టుదిట్టమైన చర్యలు జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి కంభం మరియు బేస్తవారపేట పోలీస్ స్టేషన్ లను మంగళవారం జిల్లా ఎస్పీ గారు ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా స్టేషన్ పరిసరాలు, వివిధ గదులు, విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, డ్యూటీల కేటాయింపు, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ విధానం, రికార్డ్స్ మరియు తదితర అంశాలను పరిశీలించారు. కంభం పోలీస్ స్టేషన్ లో మొక్కల నాటి, ఆవరణ పరిశుభ్రంగా, పచ్చదనం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పెండింగ్ కేసులలో విచారణ త్వరగతిన పూర్తి చేయాలని, కేసుల విచారణకు చేపట్టవలసిన విధానం గురించి దిశానిర్దేశం చేశారు. నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.నేరాలు కట్టడికి గస్తి ముమ్మురం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతర గస్తీ నిర్వహించేటట్లు, నైట్ బీట్ డ్యూటీ చేస్తున్న సిబ్బందిని తరచూ అప్రమత్తంగా చెయ్యాలని, డయల్-112 ఫిర్యాదులు రాగానే వెంటనే స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య ను పరిష్కరిoచేటట్లు చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయుటకు వచ్చే ఫిర్యాదులుదారులు పట్ల, మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి యొక్క సమస్య తెలుసుకొని వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఎస్పీ గారు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు రోడ్డు భద్రతపై జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, ఎన్ఫోర్స్మెంట్ చర్యలను పటిష్టంగా అమలు చేయడంతో శారీరక నేరాలు మరియు గ్రేవ్/నాన్ గ్రేవ్ కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా ప్రతిరోజూ వాహనాలను తనిఖీ చేస్తున్నామని, ముఖ్యంగా బస్సులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వాటి ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్, ఎగ్జిట్ డోర్స్, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, బస్సులో ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గుర్తించినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీకి తెలియజేసి తగిన చర్యలు తీసుకొని సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రయాణికులు డ్రైవర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు,ప్రజలకు సూచించారు.ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన అరుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు, మరికొందరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, క్రికెట్‌ను వినోదం కోసమే ఆస్వాదించాలని సూచిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ గారి వెంట మార్కాపురం డిఎస్పి U. నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్ బి ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, కంభం సీఐ కె.మల్లికార్జున్ రావు, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, బివిపేట ఎస్సై రవీంద్ర రెడ్డి, కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.