
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
కనిగిరి పట్టణంలోని శ్రీ బసవతారకం మెమోరియల్ ఐటిఐ కళాశాలలో మంగళవారం డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి డివైఎఫ్ఐ జిల్లా నాయకులు జి శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పి నరేంద్ర పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను అలంకరించాలని సూచించారు. డ్రగ్స్ నివారణ ప్రచార కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలోసురేష్, మహేంద్ర, చంటి, నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు