
తొలి శుభోదయం సింగరాయకొండ న్యూస్ :-
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరాయకొండ కొండ, పొన్నలూరు, కొండపిలలో జరిగిన సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సింగరాయకొండ అన్న క్యాంటీన్లో మంత్రి పేదలకు భోజనం వడ్డించిన అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ……సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సతీమణి భువనేశ్వరి రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లకు రూ. 76 లక్షల విరాళం అందజేసి ఒక రోజు పేదల ఆకలి తీర్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తున్న పాలన దక్షుడు చంద్రబాబు నాయుడు. తెలుగువారి ఆత్మగౌరవం చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అయితే తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి, పాలనదక్షత, ఆర్థిక సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి చిహ్నాలు. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, పి4 విధానం దీర్ఘ దృష్టి నాయకత్వానికి నిదర్శనం. నాడు అలిపిరిలో 23 క్లైమోర్ మైన్లు పేల్చినా మృత్యుంజయుడిగా వెంకటేశ్వరుని ఆశీస్సులతో తిరిగి వచ్చి పాలన సాగిస్తున్న ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
