
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మడనూరు గ్రామం, కొత్తపట్నం మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించనున్న రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది.ఈ నేపథ్యంలో కొత్తపట్నం మరియు జరుగుమల్లి ఎస్ఐలుతో కలిసి సింగరాయకొండ సీఐ బందోబస్తు సిబ్బందికి భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా బ్రీఫింగ్ నిర్వహించారు. ఆలయ పరిసరాలు, రథం ఊరేగింపు మార్గాలు, ప్రవేశ–నిష్క్రమణ దారులు, పార్కింగ్ ప్రాంతాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు.ట్రాఫిక్ సజావుగా నిర్వహించడం, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని పోలీస్ సిబ్బందిని వారి వారి కేటాయించిన విధి స్థానాల్లో మోహరించారు.ప్రజలు పోలీస్ సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరుతూ, రథోత్సవాన్ని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.