
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు డిటిఎఫ్ (DTF) ఎస్ఐ సుదర్శన్ గారు మరియు వారి బృందం మెరుపు దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూదమాడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 65,000/- నగదు, 5 ద్విచక్ర వాహనాలు, మరియు 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.