
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల మండలం మరుప్రోలు వారి పాలెం గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడింది. గ్రామంలో వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు తహసిల్దార్ సలీమా అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా బుధవారం మరుప్రోలు వారి పాలెం గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు తహసిల్దార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎంతోకాలంగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న తమ గ్రామానికి వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు లభించడం సంతోషకరమన్నారు. గ్రామ ప్రజలకు తాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. త్వరితగతిన వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని తహసిల్దార్ సలీమాను కోరారు. వాటర్ హెడ్ ట్యాంక్ 0.08 సెంట్లు భూమిని నిర్మాణానికి కేటాయించిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తహసిల్దార్ సలీమా ను కలిసి మరుప్రోలు వారి పాలెం గ్రామ పెద్దలు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.