
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే గారి జయంతి సందర్భంగా నెల్లూరులోని కార్యాలయంలో ఆ మహనీయునికి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.ఫూలే దంపతులు ప్రోత్సహించిన మహిళా విద్య, సామాజిక సమానత్వం నేటికీ ఆదర్శమని పేర్కొంటూ, కుల వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. అదే స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గంలో ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.