
తొలి శుభోదయం సింగరాయకొండ:-
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో సింగరాయకొండలో ఘనంగా నివాళులర్పించారు.
సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడైన మహాత్మా పూలే సేవలను స్మరించుకుంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.కార్యక్రమంలో మహాత్మా పూలె విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జయంతి–వర్ధంతులను అత్యంత గౌరవంగా నిర్వహించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి, మహిళా విద్యకు తీసుకున్న సంస్కరణలు, సామాజిక న్యాయంపై ఆయన చూపిన దిశను ఈ సందర్భంగా వక్తలు వివరించారు.స్థానిక సంఘాలు పూలే ఆశయాలను యువతలో ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకోగా, విద్యార్థులలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన మార్గం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వక్త ముక్త కంఠంతో పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ వేల్పుల సింగయ్య,పూలే కమిటీ అధ్యక్షులు ఆవుల కోటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర,ప్రముఖ న్యాయవాది సన్నిబోయిన శ్రీనివాసులు, పంతగాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ నాయకులు అర్రిబోయిన రాంబాబు, నూకసాని వెంకటేశ్వర్లు,అంబటి బ్రహ్మయ్య,అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్ ఎల్. శ్రీనివాసులు, విజయానంద్, అజయ్ కుమార్ చౌదరి, సుధాకర్ రెడ్డి, దాసూరి రాఘవయ్య, కత్తి రమేష్, అంబటి ప్రసాద్ పఠాన్ మస్తాన్, మసనఓ మాలీ రావు,చిట్టిబాబు మరియు ఇతర నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
